నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌కి ముందు టెలిగ్రామ్‌పై తాత్కాలిక బ్యాన్ విధించిన సంగతి తెలిసిందే అత్యవసర పరిస్థితుల దృష్ట్యా కేంద్రం సరైన నిర్ణయమే తీసుకుంది. ఐటీ చట్టంలోని సెక్షన్ 69ఏ ప్రకారం అన్ని విధివిధానాలను కేంద్రం పాటించింది అంటూ ఢిల్లీ హైకోర్టు శుక్రవారం విచారణ సందర్భంగా పేర్కొంది. దాంతో జూన్ 21న జరగనున్న నీట్ రీ టెస్టుకు ముందు పేపర్ లీక్‌లు, తప్పుడు సమాచార ప్రచారం, మోసాలను అరికట్టేందుకు జూన్ 22 వరకు టెలిగ్రామ్ సేవలు తాత్కాలికంగా నిలిపివేయాలని కేంద్రం నిర్ణయించింది.