శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఇంటి నుంచి గురువారం పిల్లలను తీసుకొని వెళ్లిన తల్లి. పలాస- తాళభద్ర మధ్య రైలు పట్టాలపై తల్లి, ఇద్దరు పిల్లలు మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఆత్మహత్య లేదా హత్య అనే కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. మృతులు తల్లి గేదెల పూజిత, కుమారుడు కుశాంత్ (5), కుమార్తె దీక్షిత్ (3), కోటబొమ్మాళి మండలం చలమయ్య పేట వాసులుగా గుర్తించారు. ఇవాళ ఉదయం ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.