రాష్ట్రంలో ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు శుక్రవారం(జూన్ 19) నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నది. ఆగస్టు 15 వరకు మూడు విడతల్లో ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ జరగనుంది. మొదటి విడత కౌన్సెలింగ్‌లో ఈ నెల 19 నుంచి 28 వరకు ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్, ఈ నెల 22 నుంచి 29 వరకు మొదటి సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఈనెల 25 నుంచి జులై 1 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. జులై 7వ తేదీన మొదటి విడత సీట్లు కేటాయించనున్నారు.