తెలంగాణలో రాజకీయ కార్యకలాపాలను మరింత వేగవంతం చేయడానికి, మరియు సంస్థాగత బలాన్ని పెంచుకోవడానికి జనసేన పార్టీ సిద్ధమైంది. ఇందులో భాగంగా హైదరాబాద్ లో నూతనంగా నిర్మించిన తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. శుక్రవారం ఉదయం 11:08 నిమిషాలకు ఈ నూతన కార్యాలయాన్ని శాస్త్రోక్తంగా ప్రారంభించనున్నారు. మణికొండలో జనసేన పార్టీ తెలంగాణ కేంద్రం కార్యాలయం ఏర్పాటైంది. హైదరాబాద్ కేంద్రంగా సొంత పార్టీ కార్యాలయం అందుబాటులోకి రావడం వల్ల తెలంగాణలో పార్టీ పటిష్టతకు మరింత మార్గం సుగమం అవుతుందని భావిస్తున్నారు