చత్తీస్‌ఘడ్‌లో కోరియా జిల్లాలో ఫార్చూనర్ వాహనానికి నిప్పుపెట్టడంతో దాంట్లో ఉన్న ముగ్గురు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు. ట్రక్కుల మధ్య ఫార్చూనర్ వాహనాన్ని ట్రాప్ చేసి, దానిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. మృతుల్లో స్థానిక బీజేపీ నేత,భరత్ సింగ్ ఉన్నారు.సోనాహట్, కైలాష్‌పూర్, తేలిముడ, బేలియా, చిన్గుర ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్ అంశంలో వివాదం మొదలైంది. భరత్ సింగ్ ఫ్యామిలీతో పాటు మరో బీజేపీ నేత మనోజ్ త్రిపాఠి కుటుంబం మధ్య చాన్నాళ్లుగా మైనింగ్ పట్టు కోసం వార్ నడుస్తోంది.