హైదరాబాద్ శివారులో రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుర్కపల్లి సమీపంలోని మురహరిపల్లి వద్ద కరీంనగర్ నుంచి హైదరాబాద్ వైపు వేగంగా వెళ్తున్న ఓ కారు డివైడర్ ఎక్కి.. ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది ఈ రోడ్డు ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. వాళ్లంతా గోదావరిఖని నుంచి దారిలో కొండగట్టు హనుమాన్ ఆలయాన్ని దర్శించుకుని కారులో హైదరాబాద్ కు వస్తుండగా ప్రమాదం జరిగింది.