ఉత్తర కాశ్మీర్లోని పలు ప్రాంతాలను భారీవర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. అక్కడి బందిపోరా జిల్లాల్లోని కొన్ని గ్రామాల్లో కుంభవృష్టి కురుస్తోంది. గురేజ్ కంట్రోల్ పరిధి, తులైల్ వ్యాలీలో ఉన్న తార్టెయి కిలో అనే గ్రామంలో బుధవారం ఉన్నట్లుండి కుండపోత వర్షం కురిసింది. మేఘ విస్ఫోటనం కారణంగా ఈ ప్రాంతంలో ఒక్కసారిగా భారీ వర్షం నమోదైంది. పలు చెట్లు కూలిపోగా, ఇండ్లు ధ్వంసమయ్యాయి. వందల ఎకరాల్లో వ్యవసాయ భూములు నీట మునిగాయి. పిల్లలతోసహా స్తానికులు ఇండ్లను విడిచిపెట్టి సురక్షిత, ఎత్తైన ప్రదేశాలకు వెళ్లిపోయారు.