ఒడిశాలో దారుణం జరిగింది. రెండు ట్రక్కులు ఢీకొన్న ఘటనలో వాటిలోని ఇద్దరు డ్రైవర్లు సజీవ దహనమయ్యారు. ఉదయం ఒడిశాలోని సుందర్‌గఢ్ జిల్లా, భస్మా పోలీస్ స్టేషన్ పరిధిలో కైంత్రా వద్ద, పదో నెంబర్ జాతీయ రహదారిపై జరిగింది. హైవేపై ఝార్సుగూడ నుంచి సుందర్‌గఢ్ వెళ్తున్న ట్రక్కు వేగాన్ని డ్రైవర్ నియంత్రించలేకపోవడంతో డివైడర్‌ను దాటిన ట్రక్కు ఒకవైపు నుంచి మరోవైపు రోడ్డు మీదికి వెళ్లిపోయింది. దీంతో అటువైపు నుంచి వస్తున్న ట్రక్కును ఢీకొంది. ఇలా రెండు ట్రక్కులు ఢీకొనడంతో వెంటనే మంటలు చెలరేగాయి.