ABVP మంగళవారం హైదరాబాద్ లో ధర్నా చేపట్టింది. రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగింది. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ స్కూళ్లను మూసివేసే కుట్రను తక్షణమే ఉపసంహరించుకోవాలని రేవంత్ సర్కార్ ను డిమాండ్ చేశారు. ప్రైవేట్ స్కూళ్ల ఫీజులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలం అయిందని దుయ్యబట్టారు. ధర్నా ఉద్రిక్తంగా మారింది. పోలీసులు వారిని అడ్డుకొని అదుపులోకి తీసుకుని పోలీస్ వాహనాల్లో తరలించారు.