ఫిఫా వరల్డ్ కప్ ఆరంభ పోరును డ్రా చేసుకున్న ఇరాన్‌కు ఊహించని పరిస్థితి ఎదురైంది. న్యూజిలాండ్‌పై అదరగొట్టిన ఉత్సాహంలో ఉన్న ఆ జట్టును తక్షణమే తమ దేశం వీడాలని అమెరికా అధికారులు ఆదేశించారు. దాంతో, ‘ఇదెక్కడి అన్యాయం’ అంటూ ఇరాన్ ఇరాన్ కోచ్ అమిర్ ఘలెనోయి నిరసన తెలిపాడు. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్‌కప్‌లో అణచివేతకు గురవుతున్న జట్టు తమదేనని అమిర్ వాపోయాడు. మ్యాచ్ ఉన్నప్పుడు మాత్రమే అమెరికాలో అడుగుపెట్టి.. గేమ్ అవ్వగానే తిరిగి వెళ్లాలని అధికారులు చెప్పడం అన్యాయమని ఆయన పేర్కొన్నాడు.