స్టార్ క్రికెటర్ జాంటీ రోడ్స్ ను మంత్రి నారా లోకేశ్ కలిశారు. క్రీడలు, యువజన అభివృద్ధి, క్రీడారంగంలో అద్భుతాల ఆవిష్కరణపై చర్చించారు. అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులు అవలంబించడం, రాబోయే తరం ఛాంపియన్లను తీర్చిదిద్దడంపై చర్చించాం. ఏపీని ప్రపంచస్థాయి క్రీడా హబ్ గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రపంచవ్యాప్త క్రీడాకారుల్లో జాంటీ రోడ్స్ స్ఫూర్తి నింపారు. ఆయన్ను కలవడం ఎంతో సంతోషాన్నిచ్చింది” అని లోకేశ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.