ఉక్రెయిన్‌పై మళ్లీ విరుచుకుపడింది రష్యా. తాజా దాడిలో 9 మంది మృతిచెందారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఉన్న 11వ శతాబ్ధం నాటి డార్మిషియన్ క్యాథడ్రల్పై కూడా అటాక్ జరిగింది. ఆ దాడి వల్ల చర్చిలో మంటలు చెలరేగాయి. కీవ్‌లో మొత్తం నలుగురు మృతిచెందారు. ఖార్కీవ్లో మంటల్ని ఆర్పబోయిన అయిదుగురు రెస్క్యూ కార్మికులు కూడా మృతిచెందినట్లు తెలిసింది. దేశ ప్రజలు, వారసత్వంపై రష్యా క్రూరమైన దాడి చేసిందని ఉక్రెయిన్ ప్రధాని యులియా సిరిడెంకో ఆరోపించారు.