తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా యాప్ పై రైతుల ఆగ్రహ జ్వాలలు కొనసాగుతున్నాయి. యాప్ తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో యాప్ను రద్దు చేయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు ఉదయం నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలంలో యూరియా యాప్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళనకు చేపట్టారు. మోర్తాడ్ మండలం దొన్కల్ గేట్ నేషనల్ హైవే 63 పై మూడు గ్రామాల రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.