తెలంగాణకు ఎప్పుడూ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను అప్పటి కాంగ్రెస్ పార్టీ విభజించిన తీరును తప్పుపట్టారు. పార్లమెంట్ తలుపులు మూసి, ఓ రాష్ట్రాన్ని విభజించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశామే తప్ప తెలంగాణను కాదని అన్నారు. తెలంగాణ సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, దీన్ని చిత్తశుద్ధితో చేపడతామని చెప్పారు. జాతీయ వాదాన్ని పక్కనపెట్టి, చిన్న, చిన్న అభిప్రాయాలు, కురచ భావాల, వ్యక్తిగత లాభాలతో వ్యవహరించే వ్యక్తుల వల్లే కాక్రోచ్ వంటి పార్టీలు పుట్టుకొస్తోన్నాయని అన్నారు.