తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ యావత్ తెలుగు సమాజంలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన మహాకవి దాశరథి కృష్ణమాచార్యుల వారసత్వమే జనసేన పార్టీకి అసలైన స్ఫూర్తి అని ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న రాజకీయ సిద్ధాంతాలు, పార్టీ నడుస్తున్న తీరుకు దాశరథి జీవితమే ఒక దిక్సూచి అని పేర్కొంది. సనాతన ధర్మాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్న గొప్ప జ్ఞాని అని జనసేన కొనియాడింది.

