ప్రపంచ రక్త దాతల దినోత్సవం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోని ప్రజలకు రక్తం విలువని తెలపాలనే ఉద్దేశంతో ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని ఏటా జూన్14న నిర్వహిస్తున్నారు. 1901లో ఆస్ట్రేలియాకు చెందిన నోబెల్ విజేత కార్ల్ లాండ్స్టీనర్ మొదటిసారిగా రక్తాన్ని వర్గీకరించారు. దీంతో ఆయన జయంతి గుర్తుగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.