తెలంగాణకు వచ్చి వెళ్లేందుకు.. పోటీ చేసేందుకు పవన్ కల్యాణ్ కు పూర్తి స్వేచ్ఛ ఉందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడినందునే పవన్ పై తెలంగాణ మంత్రులు మాట్లాడారని చెప్పారు. “శాంతి భద్రతల కారణంగానే పవన్ మీటింగ్ కు అనుమతి ఇవ్వలేదు. ఏపీలో జగన్ సభలకు ఎందుకు అనుమతి ఇవ్వట్లేదో పవన్ చెప్పాలి? కేటీఆర్ చెప్పినట్లు కిషన్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారు. మెట్రో విస్తరణను కిషన్రెడ్డితో మాట్లాడి అడ్డుకున్నట్లు కేటీఆర్ ప్రకటించారు” అని రేవంత్రెడ్డి అన్నారు.