మెటా సేవల్లో ప్రపంచవ్యాప్తంగా అంతరాయం ఏర్పడింది. మెటా యాప్స్ అయిన ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సప్, మెసెంజర్, థ్రెడ్స్ యూజర్లు సేవల్లో అంతరాయం ఎదుర్కొంటున్నారు. ఫీడ్ లోడ్ అవ్వకపోవడం, మెసేజులు వెళ్లకపోవడం, లాగిన్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారత్ సహా ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన యూజర్లు మెటా సేవల్లో అంతరాయం గురించి సామాజిక మాధ్యమాల్లో ఫిర్యాదు చేస్తున్నారు. దీనిపై మెటా ఇంకా అధికారికంగా స్పందించలేదు.