ఆంధ్రప్రదేశ్ లో మెగా డీఎస్సీ నియామకాలపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేసిన ఆరోపణలు పూర్తిగా అసత్యమని మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా విమర్శించారు. “జగన్ రెడ్డి గారి తప్పుడు కథనం ఇప్పుడు పూర్తిగా బహిర్గతమైంది. ఆయన చేసిన ప్రతి ఆరోపణను వాస్తవాలు, గణాంకాలు ఖండించాయి. కోర్టులు కూడా ఈ ఆరోపణలను కొట్టివేశాయి” అని పేర్కొన్నారు. డీఎస్సీ నియామక ప్రక్రియపై మొదటి నుంచి ప్రభుత్వం చెప్పినదే నిజమని.. ఇప్పుడు నిరూపితమైందని లోకేశ్ తెలిపారు.యువత భవిష్యత్తుతో రాజకీయాలు చేయడం తగదని హెచ్చరించారు.