ప్రపంచ కుబేరుల జాబితాలో ఎలాన్ మస్క్ సరికొత్త రికార్డు సృష్టించారు. ఆయన నేతృత్వంలోని అంతరిక్ష పరిశోధన సంస్థ ‘స్పేస్‌ఎక్స్’ (SpaceX) తాజాగా నిర్వహించిన 75 బిలియన్ డాలర్ల రికార్డు స్థాయి ఐపీఓ (IPO) మస్క్ సంపదను ఆకాశానికి చేర్చింది. శుక్రవారం స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ప్రారంభమైన తర్వాత ఆయన నికర ఆస్తి విలువ అక్షరాలా 1.1 ట్రిలియన్ డాలర్లను (లక్ష కోట్ల డాలర్లకు పైగా) (భారత కరెన్సీలో అక్షరాలు రూ.104 లక్షల 50 వేల కోట్లు) దాటేసిందని ఫోర్బ్స్, రాయిటర్స్ సంస్థలు స్పష్టం చేశాయి.