ఓ యువతి(23) హైదరాబాద్లోని నానక్ రామ్ గుడాలో ఉద్యోగం చేస్తూ సాయికుమార్ అనే వ్యక్తితో గచ్చిబౌలిలోని ఎలైట్ కోలివింగ్లో సహజీనవం చేస్తున్నది. అయితే సాయికుమార్ యువతిపై అనుమానంతో మద్యం తాగి వచ్చి ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. సాయికుమార్ వేధింపులు తాళలేక సదరు యువతి మనస్తాపంతో ఐదవ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.