తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ప్రస్తుతం భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భానుడి భగభగలు కొనసాగుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఉపశమనాన్ని ఇస్తున్నాయి. ఆదివారం, సోమవారం రోజుల్లో ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. నైరుతి రుతుపవనాలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ను తాకాయని, ఆదివారం లేదా సోమవారంలోగా నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రాన్ని తాకనున్నాయి. దీని ప్రభావంతో రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు తగ్గి, వాతావరణం చల్లబడనుంది.