జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా సరిహద్దుల్లో ఉగ్రవాదుల ఏరివేత కోసం సాగుతున్న సుదీర్ఘ గాలింపు చర్యల్లో తీవ్ర విషాదం నెలకొంది. దట్టమైన అటవీ ప్రాంతంలో ముష్కరుల కోసం అన్వేషిస్తున్న అస్సాం రైఫిల్స్‌కు చెందిన ఒక యువ లెఫ్టినెంట్ శనివారం సాయంత్రం ప్రమాదవశాత్తూ కాలు జారి లోయలో పడి ప్రాణాలు కోల్పోయారు. దొరిమాల్ ప్రాంతంలోని అత్యంత కఠినమైన, నిటారుగా ఉన్న కొండ మార్గాల్లో తనిఖీలు నిర్వహిస్తుండగా.. సదరు లెఫ్టినెంట్ అదుపు తప్పి సుమారు 30 మీటర్ల (దాదాపు 100 అడుగులు) లోతైన కనుమలోకి పడిపోయారు.