మెడికల్ ప్రవేశ పరీక్ష ‘నీట్-యూజీ 2026’ పునఃపరీక్షకు సంబంధించి సోషల్ మీడియాలో జూన్ 21న జరగనున్న ఈ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ లీక్ అయిందంటూ వస్తున్న లీకేజీ వార్తలు ప్రచారం పూర్తిగా అబద్ధమని, నిరాధారమైనదని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తేల్చిచెప్పింది. కొన్ని మెసేజింగ్ యాప్‌లు, సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా రీ-ఎగ్జామ్ పేపర్‌ను ముందే విక్రయిస్తామంటూ విద్యార్థులను, తల్లిదండ్రులను మోసం చేసేందుకు కొందరు కేటుగాళ్లు ప్రయత్నిస్తున్నట్లు ఎన్‌టీఏ గుర్తించింది. అక్రమంగా డబ్బులు వసూలు చేసేందుకే ఈ తరహా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడింది.