వైట్ హౌస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పాలసీ అడ్వైజర్ శ్రీరామ్ కృష్ణన్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెలాఖరుతో ఆయన బాధ్యతల నుండి తప్పుకోనున్నారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలను స్వీకరించిన ప్రారంభ రోజుల్లోనే వైట్ హౌస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పాలసీ అడ్వైజర్ శ్రీరామ్ కృష్ణన్ ఎంపిక అయ్యారు. 18 నెలలుగా ఈ హోదాలో కొనసాగారు. పలు విజయాలను అందుకున్నారు. ముఖ్యంగా అమెరికన్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ ప్లాన్ రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు.