రాష్ట్రంలోని నాలుగు రాజ్యసభ స్థానాల కేటాయింపుపై ఎన్డీఏ సమావేశంలో స్పష్టత వచ్చింది. నాలుగు స్థానాల్లో టీడీపీ 3 సీట్లు, జనసేన 1 సీటు తీసుకోవాలని కూటమి నేతలు ఏకగ్రీవంగా నిర్ణయించారు. దీనిపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ మాట్లాడుతూ.. “టీడీపీ, జనసేనకు రాజ్యసభ సీట్లు ఉంటే బీజేపీకి ఉన్నట్టే” అని వ్యాఖ్యానించారు. కాగా, జనసేన రాజ్యసభ అభ్యర్థి ఎవరనేది త్వరలోనే తమ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటిస్తారని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.