తమిళనాడు బీజేపీ కీలక నేత అన్నామలై రాజీనామా చేస్తారనే ఊహాగానాల నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, అన్నామలై పార్టీకి రాజీనామా చేయబోరని, ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదంటూ కీలక ప్రకటన చేశారు. అన్నామలై పార్టీని వీడేందుకు అమిత్ షా అంగీకరించలేదని దిల్లీ వర్గాలు చెబుతున్నాయి. అన్నామలైని బుజ్జిగించిన అమిత్ షా.. ఆయన పెట్టిన షరతులు, డిమాండ్లకు అంగీకరించినట్లు చెబుతున్నారు. తనకు పార్టీలో ఫ్రీ హ్యాండ్ కావాలని, త్వరలో చేపట్టబోయే యాత్రకు మద్దతు కావాలని అడగగా, అమిత్ షా సంపూర్ణంగా అంగీకరించినట్లు చర్చ జరుగుతోంది.