అమీర్ పేట్‌లోని మైత్రివనం కేఎస్ఆర్ షాపింగ్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయని తెలిసిందే.
కాగా ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని పోలీసులు ప్రకటించారు. ప్రమాదం జరిగిన టాయ్ షాప్ యజమాని మీడియాతో మాట్లాడుతూ.. హర్ష మెస్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ నుంచి మంటలు వచ్చాయి. మంటలను అదుపు చేసేందుకు 20 నిమిషాలు యత్నించామని.. ఈ ప్రమాదంలో సుమారు రూ.2 కోట్ల ఆస్తినష్టం సంభవించినట్టు తెలిపారు. గతంలో హర్ష మెస్‌పై ఫిర్యాదు చేశామని సదరు యజమాని తెలిపారు.