అమీర్‌పేటలోని ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షాపింగ్ కాంప్లెక్స్ రెండో అంతస్తులో ఉన్న ఎంఎస్‌ఆర్ ఫ్యాషన్స్ దుకాణంలో మంటలు చెలరేగాయి. క్రమంగా ఇతర దుకాణాలకూ వ్యాపించాయి. భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇతర దుకాణాల్లోని వారిని ఖాళీ చేయిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.