ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. రాష్ట్ర కేబినెట్ భేటీ జరుగుతుండగానే ఆయన మధ్యలోనే వెళ్ళిపోయారు. తీవ్ర వెన్నునొప్పితో బాధపడుతున్న పవన్.. మంగళగిరి పార్టీ ఆఫీసుకు వెళ్లారు. కేబినెట్ మధ్యలో అస్వస్థతకు గురికావడంతో వెళ్లినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.