ప్రముఖ యూట్యూబ్ జంట, ‘నందుస్ వరల్డ్’ ఛానెల్ నిర్వాహకురాలు రామా నందన, ఆమె భర్త జాగర్లమూడి మధుకర్, మరియు ఆయన తండ్రిపై ఎన్టీఆర్ జిల్లాలో మోసం కేసు నమోదైంది. బ్రిటన్ (UK) వీసా రెన్యూవల్ చేసి పెడతామంటూ ఓ వ్యక్తి నుంచి రూ. 15 లక్షలు వసూలు చేసి, ఆపై నమ్మకద్రోహానికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ (FIR) దాఖలైంది. 15 లక్షల నుంచి రూ. 25 లక్షల మోసం చేశారంటూ మరికొందరు ఆరోపణల వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి