గురుగ్రామ్‌లోని సెక్టార్ 46కు చెందిన వివేక్ అగర్వాల్ అనే చార్టర్డ్ అకౌంటెంట్ ఢిల్లీలోని మాక్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న తన తండ్రిని పరామర్శించడానికి ఢిల్లీకి వచ్చారు. అతనితో పాటు అతని భార్య తర్జనీ అగర్వాల్, ఇద్దరు కుమార్తెలు జివిషా, వర్య మరో నలుగురు బంధువులు హోటల్ రెస్టారెంట్లో అల్పాహారం తీసుకుంటోంది. ఢిల్లీ రెస్టారెంట్ అగ్నిప్రమాదంలో మొత్తం ఎనిమిది మంది మరణించారు. వివేక్ కుటుంబంలో ప్రాణాలతో మిగిలిన ఏకైక వ్యక్తి వివేక్ అగర్వాల్ తండ్రి రాధే శ్యామ్ అగర్వాల్(80).