నైరుతి రుతుపవనాలు అనుకున్న సమయానికే కేరళను బలంగా తాకాయని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. దీని ప్రభావంతో కేరళలో వర్షాలు మొదలయ్యాయి. అక్కడి నుంచి కర్ణాటక, తమిళనాడు మీదుగా భారీ మేఘాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వైపు దూసుకొస్తున్నాయి. దీనికి తోడు తెలంగాణ, రాయలసీమ పరిసరాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఒక ద్రోణి, అరేబియా సముద్రంపై తుపాను వలయం ఏర్పడ్డాయి. వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత తగ్గి, వాతావరణం ఒక్కసారిగా కూల్ కానుంది.