తిరుపతి అలిపిరి వద్ద వీధి వ్యాపారుల సమస్యల పరిష్కారం కోసం భూమన అభినయ్ రెడ్డి వందలాది మంది వ్యాపారులతో కలిసి ఆయన నిరసన ర్యాలీ చేపట్టారు. నిరసన ర్యాలీని ముందుకు వెళ్లకుండా అధికారులు అడ్డుకున్నారు. అనుమతి లేని ర్యాలీ అంటూ పోలీసులు నిలిపివేయడంతో అక్కడ వాగ్వాదం జరిగింది. పోలీసుల హెచ్చరికలను లెక్కచేయకుండా నిరసన కొనసాగించడంతో చర్యలు తీసుకున్నారు. భూమన అభినయ్ రెడ్డితో పాటు ఇతర నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని అదుపులోకి తీసుకుని అలిపిరి పోలీస్ స్టేషన్కు తరలించారు.