ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు, మాజీ ఏఎస్పీ భుజంగరావు నివాసాల్లో ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఈ దాడులు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్, సూర్యాపేట సహా మొత్తం 15 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా హఫీజ్‌పేటలోని భుజంగరావు ఇంటితో పాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కాగా, అదనపు ఎస్పీ అధికారి హోదాలో ఫోన్ ట్యాపింగ్ కేసులో పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భుజంగరావు ను గతంలోనే ప్రభుత్వం సస్పెండ్ చేసింది.