సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగుండేదని..కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఘోరంగా దిగజారిందని మండిపడ్డారు. బీజేపీ స్టేట్ ఆఫీస్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులకు డీఏలు ఇవ్వడం చేతకావడం లేదుగాని.. ఢిల్లీకి మూటలు తీసుకోపోవడం కాంగ్రెస్ కు తెలుసనని విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి పాలన అంతా కలెక్షన్లు.. కమిషన్ల మీదే నడుస్తుందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి పాలనపై తెలంగాణ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారని చెప్పారు.