ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ దమ్ముంటే తన ఎస్సీ సర్టిఫికెట్‌ను రద్దు చేయించాలని ప్రత్యర్థులకు సవాల్ చేశారు. తన తండ్రి అంత్యక్రియలు క్రైస్తవ పద్ధతిలోనే చేశానని.. హల్లెలూయ అంటున్నానన్నారు. భీమవరంలో నిర్వహించిన సభలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. క్రైసవుడిగా ఉండటం నేరమా.. బ్యాంకులకు కన్నాలు వేయడం నేరమా అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఎవరైనా చర్చికి వెళ్లినా.. ఇంట్లో బైబిల్, జీసస్ ఫోటో ఉన్నా క్రైస్తవులు కాదన్నారు. కేవలం బాప్టిజం తీసుకున్నవాళ్లు మాత్రమే క్రైస్తవులతారని చెప్పుకొచ్చారు.