తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కోసం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌కు లేఖ రాసినట్లు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆయన నుంచి ఇప్పటివరకు స్పందన లేదని చెప్పారు. కాగజ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన సభలో రేవంత్ మాట్లాడారు. ‘‘సమస్య పరిష్కారానికి కిషన్‌రెడ్డి దూతగా వ్యవహరించాలి. పోలవరం ప్రాజెక్టు కోసం తెలంగాణలోని 7 గ్రామాలను ఏపీలో కలపలేదా? మహారాష్ట్ర నుంచి 2 వేల ఎకరాలు మాత్రమే అడుగుతున్నాం. తెలంగాణ సీఎం అంటే మహారాష్ట్ర సీఎంకు ఎందుకంత చిన్నచూపు’’ అని ప్రశ్నించారు