తన సహచర విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుడు.. బెయిల్ కోసం హైకోర్టు వెళ్లాడు. తాను దాదాపు రెండు నెలలుగా జైల్లో ఉన్నానని, తనకు బెయిల్ ఇవ్వాలని కోరాడు. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో తమకు లభించిన హక్కులను ప్రజలు దుర్వినియోగం చేస్తున్నారని కర్ణాటక హైకోర్టు జస్టిస్ ఆర్. నటరాజ్ అభిప్రాయపడ్డారు. ‘‘బహుశా అరబ్ దేశాల తరహాలో తప్పు చేసిన వారి కాళ్లు, చేతులు నరికేసే కఠినమైన శిక్షలు ఉంటేనే, ఇక్కడి ప్రజలు చట్టాలను గౌరవిస్తారేమో’’ అని ఆయన వ్యాఖ్యానించారు.