ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం తిరిగి రగులుకుంది. సోమవారం అమెరికా సేనలు పలు ఇరాన్ సైనిక స్థావరాలను ఎంచుకుని బాంబుల వర్షం కురిపించాయి. ఇరాన్‌కు చెందిన శక్తివంతమైన రాడార్, డ్రోన్ల స్థావరాలపై విరుచుకు పడ్డారు. శాంతి ఒప్పందం ఖరారు తుది దశలో ఉన్న సమయంలోనే సోమవారం ఇరాన్ ఆదివారం అమెరికాకు చెందిన డ్రోన్‌ను కూల్చివేసింది. దీనికి ప్రతీకారంగా అమెరికా దాడులకు దిగింది. సోమవారం ఇరాన్ డ్రోన్లు కువైట్‌లో కొన్ని స్థావరాలను ఎంచుకుని దాడికి దిగాయి.