రాష్ట్ర అభివృద్ధిలో జనసేన పాత్ర, భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేసుకునేందుకు తలపెట్టిన ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వకపోవడం అర్థరహితమని పార్టీ సోషల్ మీడియా వేదికగా మండిపడింది. సంధ్య కన్వెన్షన్ హాల్లో నిత్యం అనేక రాజకీయ, సాంస్కృతిక, కార్పొరేట్ సమావేశాలు జరుగుతుంటాయని, కేవలం జనసేన సభకు మాత్రమే పార్కింగ్ సమస్యను సాకుగా చూపడం సరికాదని జనసేన నేతలు విమర్శించారు. శాంతియుతంగా కార్యకర్తలతో సమావేశం నిర్వహించుకునే హక్కును కాలరాయడం ప్రజాస్వామ్య విరుద్ధమని జనసేన ఆవేదన వ్యక్తం చేసింది.