రాష్ట్రాల హైకోర్టులకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు, మార్గదర్శకాలు జారీ చేసింది. ఆయా కేసులో తీర్పు రిజర్వు చేసిన తర్వాత మూడు నెలల్లో దానిని వెలువరించాలని సూచించింది. తీర్పు వెలువరించడంలో ఆలస్యం జరిగితే కక్షిదారులకు నష్టాన్ని తెచ్చిపెడుతుందని పేర్కొంది. తద్వారా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుందని సిజెఐ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల బాగ్చి, జస్టిస్ విపిన్ పంచోలితో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది.