ఇన్ సర్వీస్ టీచర్లకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) అర్హత తప్పనిసరి అని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. టీచర్ వృత్తిలో కొనసాగాలనుకునే వారికి టెట్‌లో అర్హత సాధించడానికి మరింత వెసులుబాటును కల్పించింది. టెట్ అర్హతకు గతంలో విధించిన గడువును సవరిస్తూ 2028 ఆగస్టు 31 వరకు దానిని పొడిగిస్తున్నట్లు శుక్రవారంనాడు న్యాయస్థానం ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వాలు, ఉపాధ్యాయ సంఘాలు, వ్యక్తిగత ఉపాధ్యాయులు దాఖలు చేసిన 65కి పైగా రివ్యూ పిటిషన్లను జస్టిస్ దీపాంకర్ దత్తా, మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది.