ఈ ఏడాది ‘ఎల్ నినో’ ప్రభావం వల్ల రుతుపవనాలు బలహీనపడే సూచనలు ఉన్నాయని, దీనివల్ల సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. ఈ నేపథ్యంలో, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు అప్రమత్తత ప్రకటించాయి.కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వర్షపాతం తక్కువగా నమోదయ్యే జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి, ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.