చంద్రబాబు శక్తుల నుంచి తెలంగాణ ను కాపాడు కోవలసిన బాధ్యత బీఆర్‌ఎస్ శ్రేణులపై ఉందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి, చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి తెలంగాణ ఆనవాళ్లను చెరిపేసేందుకు కుట్ర పన్నుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు సమక్షంలోనే తెలంగాణను అవమానించిన తెలంగాణ ద్రోహి బక్కని నరసింహులని పేర్కొన్నారు.ఈ వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి , బీజేపీ నాయకులు, చంద్రబాబు నాయుడు ఇప్పటికి ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. ఏనాటికైనా కేసీఆరే తెలంగాణకు శ్రీరామ రక్ష అని వెల్లడించారు.