ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసు దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) మరింత వేగవంతం చేసింది. ఈ కేసులో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు కె. నాగేశ్వరరెడ్డి (కేఎన్ఆర్) టార్గెట్గా సిట్ అధికారులు రంగంలోకి దిగారు. గురువారం విజయవాడలోని ఆయన నివాసంలో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మద్యం వ్యాపార లావాదేవీలకు సంబంధించిన ఆధారాల కోసమే ఈ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం.