వైకాపా హయాంలో జరిగిన ఏపీ మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈడీ విచారణ ముగిసింది. బషీర్ బాగ్ ఈడీ కార్యాలయంలో ఏడున్నర గంటల పాటు అధికారులు ఆయన్ను విచారించారు. రహస్య ఆర్థిక లావాదేవీలపై ఆయన్ను ప్రశ్నించినట్లు సమాచారం. బ్యాంకు లావాదేవీలు, “కేసు దర్యాప్తులో భాగంగా గతంలో సీజ్ చేసిన మొబైల్ ఫోన్లలోని వివరాలను సేకరించారు. ఈ కేసుతో నాకు సంబంధం లేదు. నేను ఎవరి పేర్లూ చెప్పలేదు. మద్యం కుంభకోణానికి సంబంధించిన విషయాలన్నీ రాజ్ కెసిరెడ్డికి తెలుసని చెప్పాను” అని విజయసాయిరెడ్డి అన్నారు.

