స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి పార్టీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయంలో రీజనల్ కో-ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జిలతో జగన్ అత్యున్నత స్థాయి విస్తృత సమావేశంలో శంఖారావం పూరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవాలు జరిగితే ఊరుకునేది లేదని, దానిని
ఇన్‌ఛార్జిల వైఫల్యంగా భావించి సీరియస్‌గా యాక్షన్ తీసుకుంటానని జగన్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి రెండేళ్ల పాలన వెన్నుపోట్లకు, అరాచకాలకు, అబద్ధాలకు, దోపిడీకి ప్రతిరూపంగా మారిందని మండిపడ్డారు.