తెలంగాణలో మహిళలను ఆర్థికంగా నిలబెట్టే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రజా పాలన, ప్రగతి ప్రణాళికలోభాగంగా నిర్వహిస్తున్న మహిళా వారోత్సవాల వేదికగా సీఎం రేవంత్ రెడ్డి సచివాలయం నుంచి వర్చువల్ పద్ధతిలో ఒకేసారి 8,000 ఇందిరా గాంధీ స్త్రీ శక్తి భవనాలకు శంకుస్థాపన చేశారు.మహిళలను ఆర్థికంగా నిలబెట్టే అద్భుతమైన కార్యక్రమంగా 8000 భవనాలకు ఒకే సారి శంకుస్థాపన చేస్తున్నామని, దేశంలోనే ఇది ఒక సంచలన నిర్ణయమని పేర్కొన్నారు.