పోక్సో కేసులో తన పరువుకు భంగం కలిగించారని నోటీసులు పంపించడంపై బీఆర్ఎస్ నేత ప్రవీణ్‌కుమార్ మండిపడ్డారు. తమరి పరువు పోయిందని మా అందరిపై కోట్ల రూపాయల దావా వేశారు కదా.. నిజంగా మీకు ఇంకా పరువు మిగిలి ఉందని రుజువు చేస్తే కూలీ పని చేసైనా మీకు జరిగిన నష్టానికి పరిహారం బరాబర్ చెల్లిస్తామని తెలిపారు. కానీ మీ ‘బగ్గీ’ చిదిమేసిన ఆ నోరు లేని పేరు లేని ఆ బాలిక పరువు విలువ ఎన్ని కోట్ల రూపాయలో మీరు చెప్పగలరా అని నిలదీశారు.